Friday, December 20, 2024

రెండుసార్లు కోరి కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నాం: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ సమస్య తీర్చలేదని అన్నారు. ఎల్బీ స్టేడియంలో 10 వేల టీచర్లకు నియామకపత్రాలు అందజేసే కార్యక్రమంలో సిఎం రేవంత్ మాట్లాడారు.

“రెండుసార్లు కోరి కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నాం. ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశించారు.  తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. గతంలో రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తయింది. నిరుద్యోగుల సమస్యలు బిఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదు. అందుకే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి. తండ్రీకొడుల ఉద్యోగాలు ఊడగొడితే.. మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 9 నెలలోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. డీఎస్సీ విజేతలను చూస్తుంటే దసరా ముందే వచ్చినట్లు ఉంది” అని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News