Saturday, February 22, 2025

జలద్రోహి… కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఆనాడు వైఎస్ అక్రమంగా కృష్ణా జలాలు సీమకు తరలించుకుపోతుంటే
సహకరించింది కెసిఆర్ కదా? జగన్‌ను ఇంటికి పిలిచి భోజనం పెట్టి
సీమ ఎత్తిపోతలకు సహకరించింది నువ్వు కాదా? ఇది తెలంగాణకు
ద్రోహం కాదా? ఆయన చేసిన పాపం ఇప్పుడు రాష్ట్రాన్ని
వెంటాడుతున్నది ఆ పదేళ్లు సాగునీటి మంత్రులుగా ఉన్నది కెసిఆర్,
హరీశ్‌రావులే కాదా? పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు
ఎండబెట్టారు ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామంలో మేం పోటీ చేయం…
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న గ్రామంలోనే మీరు పోటీ చేస్తారా?
కెసిఆర్ పదేళ్ల పాలన, మోడీ 12 ఏళ్ల పాలనపై , మా 12నెలల
పాలనపై చర్చకు సిద్ధమా? నారాయణపేటలో జరిగిన
బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే కెసిఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జలాలను ఎపి తరలించుకుపోతున్నా.. మాట్లాడడం లేదన్న విమర్శలపై రేవంత్ స్పందించారు. ఆనాడు సిఎంగా ఉన్న వైఎస్ కృష్ణా జలాలను సీమకు తరలించుకు పోతుంటే సహకరించింది కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు.పదేళ్ల బిఆర్‌ఎస్ పాలన, 11 ఏళ్ల మోడీ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చ కు తాను సిద్ధమని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు సిఎం రేవంత్ రెడ్డి స వాల్ విసిరారు. దీనిపై కెసిఆర్, కిషన్‌రెడ్డిలు చర్చకు రావాలని ఆయన సూచించారు. చర్చలో తాను ఓడి తే ముక్కు నేలకు రాస్తానని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్/నారాయణపేట ప్రతినిధి: పదేళ్ల బిఆర్‌ఎస్ పాలన, 11 ఏళ్ల మోడీ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై కెసిఆర్, కిషన్‌రెడ్డిలు చర్చకు రావాలని ఆయన సూచించారు. చర్చలో తాను ఓడితే ముక్కు నేలకు రాస్తానని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రావాలని, బిఆర్‌ఎస్ నుంచి కెసిఆర్ వస్తారో కొడుకును, అల్లుడిని పంపిస్తారో చెప్పాలని ప్లేస్, డేట్ చెప్పాలని చర్చకు తాను సిద్ధమని సిఎం రేవంత్ తెలిపారు. కెసిఆర్ గట్టిగా కొడతానంటున్నావ్ గట్టిగా కొట్టడానికి అది ఫుల్లా, హాఫా కొట్టాలనుకుంటే ముందుగా మీ బిడ్డను, కొడుకును, అల్లుడిని కొట్టు మమ్మల్ని కొడితే మా కార్యకర్తలు ఊరుకుంటారా? అని సిఎం రేవంత్ అన్నారు.

నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యే ఫర్ణికారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ ప్రజాపాలన బాగాలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలిచ్చామని, రూ.21 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని ఆయన చెప్పారు. ఆర్టీసిలో మహిళలకు 600 బస్సులను అప్పగించి వారిని ఓనర్లను చేశామన్నారు. రూ.5వేల కోట్లతో కొడంగల్, వెయ్యి కోట్లతో నారాయణపేట అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు రాకుండా బిఆర్‌ఎస్, బిజెపి అడ్డుకుంటుందని ఆయన మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను మొదలు పెట్టానని రేవంత్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను ఐదేళ్లలో పూర్తి చేసే బాధ్యత తనదేనని రేవంత్ అన్నారు.

సీమకు కృష్ణా జలాల తరలింపులో
కెసిఆర్ హస్తం
ఆనాడు వైఎస్‌కు ఊడిగం చేసి కృష్ణా జలాలను సీమకు తరలించుకుపోయేందుకు సహకరించింది నువ్వు కాదా కెసిఆర్ అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఆరు గంటల పాటు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు తరలించుకు పోతుంటే చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా, ఇది ద్రోహం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. నువ్వు చేసిన పాపం ఇవాళ రాష్ట్రాన్ని వెంటాడుతుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. పదేళ్లలో సాగునీటి మంత్రులుగా ఉన్న ది హరీష్, కెసిఆర్ కాదా అని ఆయన అన్నారు. ఈ పాపం మీది కాకపోతే ఇంకెవరిదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నీళ్లు రాయలసీమ తరలించుకుపోతే నిధులు కెసిఆర్ కుటుంబం తరలించుకుపోయిందని సిఎం రేవంత్ మండిపడ్డారు. పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని ఆయన అన్నారు.

పాలమూరును ఎడారిగా మార్చారు

పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500ల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసు కున్నామని పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదని, పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కెసిఆర్ ఎందుకు పూర్తి చేయలేదన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి కెసిఆర్ పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారని ఆయన ఆరోపించారు. మక్తల్ నారా యణపేట కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతి తెస్తే తనపై కోపంతో దానిని పడావు పెట్టారన్నారు. బిఆర్‌ఎస్‌కు సూటిగా సవాల్ విసురుతున్నానని, ఏ ఊర్లో తాము ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో ఆ ఊర్లో తాము పోటీ చేస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఏ ఊర్లో బిఆర్‌ఎస్ నాయకులు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడ మీరు పోటీ చేయాలని బిఆర్‌ఎస్ నాయకులకు సిఎం సవాల్ విసిరారు. తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బిసి కులగణన నిర్వహించామని ముప్పై ఏళ్లుగా పరిష్కారం కానీ, ఎస్సీ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపామని సిఎం రేవంత్ తెలిపారు. ఇవన్నీ కెసిఆర్ కళ్లకు కనిపించడం లేదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

కుట్రలు చేస్తున్న వారికి బుద్ది చెప్పాలి
కుట్రలు చేస్తున్న వారికి బుద్ది చెప్పాలని, పాలమూరు పచ్చగా కనబడితే వాళ్ల కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వాళ్ల కడుపులు మండుతున్నాయ్, మీరు బాధపడొద్దు కన్నీరు పెట్టుకోవద్దు, ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి పాలమూరును అభివృద్ధి చేసుకుందామని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని బయలుదేరి మనపై కుట్రలు చేస్తున్నారని వారికి మీరు సరైన గుణపాఠం చెప్పాలని సిఎం రేవంత్ సూచించారు.

ప్రతి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గంలో
పెట్రోల్ బంక్
రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపే తం కావడానికి వీలుగా ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలి దశలో జిల్లా కేంద్రాల్లో ఆ తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసు కోవడానికి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించాలని సిఎం అధికారులను ఆదేశించారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిదిగా నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. తెలంగాణలో కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

కోటి మందిని చేర్చుకొని అవకాశం వస్తే ఏదో ఒకరోజు మహిళలం దరూ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం మన మహిళా శక్తిని ప్రపంచానికి చాటుదామని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రిని కూడా ఆహ్వానిద్దామన్నారు. మహిళా సంఘాలకు ఇప్పటికే అనేక పనులు అప్పగించామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, సూళ్లల్లో పిల్లల యూనిఫాంలను కుట్టించే కార్యక్రమాలను అప్పగించామన్నారు. ఐకెపీ కేంద్రాలు మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు. మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులు ఆర్టీసికి అద్దెకు నడిపించే కార్యక్రమం ప్రారంభమయ్యిందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం కల్పించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News