Monday, December 23, 2024

తెలంగాణను 3 జోన్లుగా విభజించాం: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని సీఎం అన్నారు.

ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో సిఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బానిస సంకెళ్లను తెంచి ప్రజాపాలనను అందిస్తున్నామని సిఎం తెలిపారు. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని వివరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నం ఆవిష్కరిస్తామన్నారు. మూసీ సుందరీకరణ పథకం ద్వారా వెయ్యి కోట్లతో పరివాహక ప్రాంతం ఉపాధికల్పన జోన్ గా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆర్థిక క్రమ శిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే అభివృద్ధిలో రాజీలేని కృషి చేస్తామని.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News