వెనుకబడిన తరగతులకు మేలు చేసే కులగణనలో కెసిఆర్,
కెటిఆర్ ఎందుకు పాల్గొనడంలేదు? మీరు బిసి వ్యతిరేకులా?
బిసిలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం మీకు ఇష్టం లేదా?
కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలి
ప్రజలు మాకు ఐదేళ్లు అధికారం ఇచ్చారు.. పది నెలలు ఓపిక
పట్టలేకపోతున్న బిఆర్‌ఎస్ నాయకులు వాళ్ల దుఃఖం దేనికో
అర్థం కావడం లేదు ఏడాది కాలంలోనే ఎక్కువ ఉద్యోగాలు
ఇచ్చి రికార్డు సృష్టించాం గుజరాత్‌లో మోడీ ఎన్ని ఉద్యోగాలు
ఇచ్చారో చర్చకు సిద్ధమా? పదేళ్లలో కోటి మంది మహిళలను
కోటీశ్వరులను చేస్తాం ఇందిరమ్మ రాజ్యంలో యువవికాసానికి
అభివృద్ధి బాటలు పెద్దపల్లి యువవికాసం సభలో సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్/పెద్దపల్లి ప్రతినిధి : ప్రతిపక్ష విషప్రచారాన్ని తిప్పికొట్టాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ఉంది కాబట్టే విజ్ఞప్తులు వస్తున్నాయని, ప్రజల కోసం ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కడుపుమంటతో కొంతమంది త ప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్ల పాటు ప్రజలను మోసం చేసి ఇప్పుడు బజారెక్కి మాట్లాడుతున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనపై విమర్శలు చేస్తున్న వారికి సి ఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లిలో నిర్వహించిన యువవికాస సభలో పాల్గొన్న ఆయన బిఆర్‌ఎస్, బిజెపి నాయకుల తీ రుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ శత్రువుల విష ప్రచారాన్ని తిప్పి కొడతామన్నారు. బోనస్‌తో వరి రైతులు అ ధికంగా లాభపడ్డారని ఆయన తెలిపారు.
ఏడాది కాలంలోనే ఎక్కువ ఉ ద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించామని, మంత్రి శ్రీధర్‌బాబు పట్టుబట్టి మరీ పెద్దపల్లికి నిధులు తీసుకొచ్చారని సిఎం రేవంత్ తెలిపారు. ఎం పి గా ఓడిపోయిన కల్వకుంట్ల కవితకు మూడు నెలల్లోనే ఎమ్మెల్సీ పద వి ఇచ్చారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ హయాంలో ఓడిపోయి న వాళ్లకు పదవులు కల్పించిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ఎంపిగా ఓడిపోయిన వినోద్‌కు కేబినెట్ పదవి ఇచ్చారని ఆయన విమర్శించారు. కెసిఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికా తెలంగాణను తెచ్చుకుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసింది శూన్యమని, మంచి పాలన అందిస్తున్న తమపై కొత్త బిచ్చగాడి మాదిరిగా కెసిఆర్ శాపనార్ధాలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా అని రేవంత్ ప్రశ్నించారు. ప్రతిదానికీ కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఐదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టుతోనే ప్రజల్లోకి వెళ్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లెక్కలు తీద్దామా…
గుజరాత్ లో ఏ సంవత్సరంలోనైనా 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా అన్న విషయాన్ని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి వారికి సవాల్ విసిరారు. మాజీ సిఎం కెసిఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాళేశ్వరం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పని మంతుడి పందిరేస్తే కుక్క తోక తగిలి పందిరి కూలినట్టుగా కాళేశ్వరం పరిస్థితి ఉందని ఆయన సెటైర్లు వేశారు. ఊళ్లమీద పడి మాట్లాడటం కాదని, ప్రాజెక్టులపై లెక్కలు తీయడానికి కెసిఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.
వీలైతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి
ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించామమన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని.. ఇలా దేశంలోని ఏ రాష్ట్రంలో జరగలేదని ఆయన తెలిపారు. అంతేకాదు ఏడాదిలో 25 వేల కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని ఆయన చెప్పారు. కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించబోమని ఆయన తెలిపారు. ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికి కాదు రాష్ట్రాన్ని సాధించుకుందని ఆయన అన్నారు. గత పదేళ్లలో కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని ఆయన మండిపడ్డారు. వీలైతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని, విమర్శలు చేయొద్దని ఆయన సూచించారు.
ప్రజల అభిమానంతోనే ముఖ్యమంత్రిని అయ్యా
మీరు పదేళ్లు కాలయాపన చేశారు, అభివృద్ధి ఎలా ఉంటుందో తాము చేసి చూపిస్తున్నామని సిఎం రేవంత్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తొలిసారి లేఖ ఇచ్చింది చిన్నారెడ్డేనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో లేదని అప్పట్లో ప్రచారం చేశారని, కానీ, కొత్తగూడెం నుంచే అది ప్రారంభమైందని ఆయన తెలిపారు. తమకు ఉద్యోగాలన్న నినాదంతోనే ఈ ఉద్యమం మొదలైందన్నారు. సంవత్సరం క్రితం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఓట్లు వేస్తేనే తమకు పదవులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానిం చారు. ప్రజల అభిమానంతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చామని ఆయన తెలిపారు. ప్రజల త్యాగాలు, ఆకాంక్షలు తనకు తెలుసని, అందుకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నానని రేవంత్ చెప్పారు. తెలంగాణలో ఉద్యోగా వకాశాలు, గిట్టుబాటు ధర వస్తుందని ప్రజలు అశించారని, కానీ, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో అలా జరగలే దన్నారు. రైతులు ఉరేసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్‌కు మాత్రం ఎకరాకు కోటి పంట పడిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎకరాకు కోటి ఆదాయం ఇప్పటికీ బ్రహ్మపదార్థమేననని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని బడిదుడుకులైనా భరిస్తా
మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని బడిదుడుకులైనా భరిస్తానని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. తమకు ఉద్యోగాలు కావాలన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, కానీ, గత బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగాలు రాలేదని, రైతులకు గిట్టుబాటు ధర దక్కలేదని, కెసిఆర్ హయాంలో రైతులు ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అన్నారని, కెసిఆర్ మాత్రం వరి వేసుకున్నారని సిఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమయ్యేదని ఆయన పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలను మోసం చేసినోళ్లు పది నెలలకే ఏం చేశారని రోడ్డెక్కి మమ్మల్ని అడుగుతున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం కష్టపడి పని చేస్తోందని, కడుపు మంటతో కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రువు ఏం చేస్తున్నారో అన్ని గమనిస్తున్నామని వాళ్ల విష ప్రచారాన్ని తిప్పి కొడతామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
8,084 మందికి నియామకపత్రాలు
గ్రూప్-4 లో ఎంపికైన 8,084 మందికి యువ వికాసం వేదికపై నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ గడ్డపై కాలు పెట్టినప్పుడల్లా ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారన్న నమ్మకాన్ని కలిగించిన సోనియమ్మ తనకు గుర్తుకు వస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించే సోనియమ్మ తెలంగాణ కలను సాకారం చేశారని ఆయన తెలిపారు. రూ.1035 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నామంటే అది ప్రజా పాలన వల్లేనని, తాము కడుపు కట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే కొందరు వాళ్ల భవిష్యత్ చీకటిమయమ వుతుందని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పది నెలల తమ పాలనపై వాళ్లు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ పదిరోజుల్లో తిప్పి కొడతామన్నారు.
సన్నవడ్లు పండించిన ఘనత పెద్దపల్లి జిల్లాదే
33 జిల్లాల్లో అత్యధికంగా 2 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు పండించిన ఘనత పెద్దపల్లి జిల్లాదని ఆయన తెలిపారు. 95 శాతం రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయని సిఎం తెలిపారు. కెసిఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి రాగానే యూనివర్సిటీలను బలోపేతం చేశామన్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజీ కావాలని కోరారని, వాటిని ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. కనీసం సమస్యలపై ధర్నా చేసుకోలేనంత నిర్బంధాల మధ్య తెలంగాణ పదేళ్లు మగ్గిపోయిందని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఇందిరాపార్కులోని ధర్నా చౌక్ లో ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. తమ పిసిసి అధ్యక్షుడు వారి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. పదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదని, తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచిందని సిఎం తెలిపారు.
కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలి
ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, పది నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల దుఃఖం దేనికో అర్థం కావడంలేదన్నారు. పదేళ్లు సిఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కెసిఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలన్నారు. రండి అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వాలని, ఎకరానికి కోటి ఎలా సంపాదించిన మీ అనుభవాన్ని ప్రజలకు వివరించాలని సిఎం రేవంత్ సూచించారు. కులగణనలో కెసిఆర్, కెటిఆర్, హరీష్, సంతోష్‌లు ఎందుకు పాల్గొనడం లేదని ఆయన ప్రశ్నించారు? మీరు బిసి వ్యతిరేకులా బిసిలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? బిసి సంఘాలు ఆలోచన చేయాలని, కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతకుముందు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎంఎల్‌సి జీవన్ రెడ్డి, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ, ఎంఎల్‌ఎలు చింతకుంట విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు యువ వికాసం విజయోత్సవ సభలో పాల్గొనేందుకు పెద్దపెల్లి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దపల్లి ఎంఎల్‌ఎ చింతకుంట విజయ రమణారావు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని పెద్దపల్లి మండలం పెద్దకాల్వలలో ఏర్పాటు చేసిన యువ వికాసం విజయోత్సవ సభకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో 1024 కోట్ల 90 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ గరుడ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, డీ.ఈ.ఈ.టి, టాస్క్, ఎన్.ఎస్.ఐ.సి, న్యాక్, యువజన క్రీడా శాఖ, సింగరేణి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గ్రూప్ 4, సింగరేణి పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో యువతకి నైపుణ్యత అందించే దిశగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిమ్స్ హాస్పిటల్, లక్ష్యా సంస్థ, రెడింగ్ టన్, లాజిస్టిక్ స్కిల్ కౌన్సిల్, జిఎంఆర్ ఎయిర్ పోరట్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ , అరబిందో ఫార్మా బ్లూ వీల్స్ వంటి ఏడు సంస్థలకు మధ్య ఎంఓయు పూర్తి చేశారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను యువతకు చేరువచేసేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డీ.ఈ.ఈ.టి (డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ)ను సిఎం ప్రారంభించారు. విద్యార్థులకు, యువకులకు నిర్వహిస్తున్న సిఎం కప్ క్రీడా పోటీలను ఆవిష్కరించారు.