Saturday, December 21, 2024

నళినికి ఎందుకు న్యాయం చేయలేదు?: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గత బిఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిలదీశారు. అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్ లోకి పిలిపించుకున్నారా?.. ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన వారి కుటుంబాలను ఎప్పుడైనా ఆదుకున్నారా..? తన కుటుంబంలోని కుమారుడు, కుమారై, బంధువులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారని ప్రశ్నించారు.

తన కుమారై ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే మెమ్మెల్సీ పదవి ఇచ్చారు. తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగం వదులుకున్న నళిని ఏమైనా న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ ఎత్తివేసి తెలంగాణ ప్రజల ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేశారు… ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు మేం మళ్లీ ధర్నా చౌక్ ను పునరుద్ధరించామని చెప్పారుజ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News