Sunday, December 22, 2024

కేంద్రం నిర్లక్ష్యంతో రంగారెడ్డి వెనుకబడింది: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

పాలమూరు-రంగారెడ్డి ప్జాజెక్టుకు జాతీయ హోదా అడిగినా కేంద్రం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. రంగారెడ్డి అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవాలని సీఎం అన్నారు.  జిల్లాలో తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ పడావు పెట్టిందని విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్‌, ఐటీఐఆర్‌ కారిడార్‌ అడిగితే బీజేపీ ఇవ్వలేదని.. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News