Monday, December 23, 2024

గుండెలపై ‘టిజి’ అని పచ్చబొట్టు వేయించుకున్నారు: సిఎం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టిజి అని రాసుకునేవాళ్లమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కొందరు యువకులు తమ గుండెలపై టిజి అని పచ్చబొట్టు వేయించుకున్నారని సూచించారు. ఉద్యమ సమయంలో వాహనాలపై, బోర్డులపైన అందరం టిజి అని రాసుకున్నామన్నారు. కేంద్రం కూడా తమ నోటిఫికేషన్ లో టిజి అని పేర్కొన్నది. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టిఎస్ అని పెట్టిందని సిఎం రేవంత్ ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ట్ర అక్షరాలను టిజిగా మర్చాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News