Wednesday, January 22, 2025

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సిఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథకం ప్రారంభించనున్నట్లు సిఎం చెప్పారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా సిఎం రేవంత్.. పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌ హౌస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ తోపాటు మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి, తుమ్మల పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ముందు చెప్పినట్లు వరంగల్‌ డిక్లరేషన్‌ అమలులో భాగంగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. రుణమాఫీ అసాధ్యమని కొందరు చెప్పారని.. కానీ, రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఫసల్‌బీమాలో చేరాలని నిర్ణయించామని సిఎం రేవంత్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News