Thursday, December 12, 2024

అన్నింటినీ అడ్డుకుంటే అభివృద్ధి ఎలా?: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -
  • కెసిఆర్ వదిలిన గాలి బ్యాచ్ గందరగోళం సృష్టిస్తోంది
  • ఇది తెలంగాణకు మంచిదా?
  • ఏడాదిలో 55వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదే
  • బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే.. ఢిల్లీకి వచ్చి క్షమాపణ చెబుతా
  • ఏడాదిలో రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర మాది
  • మోడీజీ..మా మంచి పనులను అభినందించండి
  • నడ్డా..మా అడ్డాకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడితే సహించం
  • గెలిస్తే పొంగిపోవడం..ఓడితే కుంగిపోవడం కెసిఆర్ నైజం
  • సంక్రాంతి తరువాత రైతుభరోసా జమ 
  • మూసీ ప్రక్షాళన వద్దని కొందరు అడ్డం పడుతున్నారు
  • మూసీ ప్రక్షాళన చేయాలో వద్దో కెసిఆరే చెప్పాలి
  • నల్లగొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో/హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఉప్పొంగడం.. ఓడిపో తే కుంగిపోవడం.. ఫాంహస్‌కే పరిమితం కా వడం మంచిదికాదు.. ఓడినా.. గెలిచినా ప్రజ ల్లో ఉండాలి.. కొట్లాడాలి.. వీలైతే ప్రభుత్వాని కి సలహాలు ఇవ్వాలి.. అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏనాడైనా అసెంబ్లీకి వచ్చారా? ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? వయసు, అనుభవం ఉండి కూడా సలహాలు ఇవ్వలే.. సూచనలు చేయలే.. ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండ టం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. అం టూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కేసిఆర్‌కు చురకలు వేశారు. ఆనాడు జానారెడ్డి.. త ర్వాత భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఉండి కొట్లాడారు.. మీలాగా బయటకు వెళ్ళకుండా ఉండలేదు అంటూ మండిపడ్డారు. మాజీమంత్రి కే టిఆర్, హరీష్‌రావులను గాలిబ్యాచ్‌ను జమచే సి ఊరి మీదకు వదిలిండు అని ఎద్దేవా చే శా రు. త్రిబుల్‌ఆర్ వద్దు.. ఫార్మాసిటీ వద్దు.. ఫ్యూ చర్ సిటీ వద్దు.. పాక్సికాన్ సిటీ వద్దు.. రో డ్లు వద్దు.. భూసేకరణ వద్దు.. ఉద్యోగాలు వద్దు.. ఇలా అన్ని వద్దంటే తెలంగాణకు మంచిదా? మీరే ఆలోచించుకోవాలని హితవు పలికారు. 1200మంది ఆత్మబలిదానాలు చేసుకుంది మీనలుగురి కోసమా? అంటూ మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 55,143 మందికి ఉద్యోగాలిచ్చాం.. నడ్డా మాగడ్డ మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు.. మీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏడాదిలో ఇంతపెద్ద ఉద్యోగాలు ఇస్తే మేము ఢిల్లీ నడిబొడ్డున మీకు క్షమాపణ చెపుతానని సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లాలో బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రెండోయూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం నల్లగొండలో మెడికల్ కళాశాల నూతన భవనాలను ప్రారంభించారు. ఆతర్వాత రాజీవ్ ప్రాంగణంలో ప్రజాపాలన ఏడాది విజయోత్సవ సంబరాల సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమాల పురిటిగడ్డ, పోరుగడ్డపై ఏడాది విజయోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జూన్ 2వతేదీకి ఎంత ప్రాధాన్యత ఉందో.. డిసెంబర్ 7వతేదీకి కూడా అంతే ప్రాధాన్యత ఉందని గుర్తుచేశారు.

తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రిపదవిని వదిలిస్తే.. మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి కూడా మంత్రిపదవిని వదిలేసి కొట్లాడారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే వెంకట్‌రెడ్డి మంత్రిపదవి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం.. తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడిన ఘనకీర్తి నల్లగొండ జిల్లాకు దక్కుతుందని సీఎం గుర్తుచేశారు. రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం లాంటి పోరాటయోధులను తలచుకోవడం.. పోరాటాల గడ్డ గాలిపీల్చుకుంటే పోరాటాలు గుర్తుకొస్తాయని చెప్పారు. అంతేకాకుండా సమైక్యపాలనలోనూ, కేసిఆర్ పదేళ్ళ పాలనలోనూ దక్షిణతెలంగాణ వివక్షతకు లోనైందని గుర్తుచేశారు. ఊపిరి అయినా వదులుతం కానీ కాంగ్రెస్ జెండా వదలం.. అని ఉమ్మడిజిల్లా కార్యకర్తలు వీరసైనికుల్లా పోరాడి పన్నెండులో పదకొండు మందిని గెలిపించారన్నారు. ఉమ్మడిజిల్లాలోని ఎస్‌ఎల్‌బిసి టన్నెల్, బ్రహ్మణవెల్లంల, ఉదయసముద్రంతోపాటు పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వ, గంధమల్ల, బస్వాపూర్ లాంటి పెద్ద, చిన్న సాగునీటి ప్రాజెక్టులకు ఎన్నికోట్లయినా నిధులిస్తానని సీఎం ప్రకటించారు. సాగునీటి మంత్రి ఉత్తమ్‌ది మీజిల్లానే.. ఆర్థిక మంత్రి భట్టి ఎన్ని నిధులైనా ఇస్తరు.. అన్ని పనులు పూర్తిచేసి సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పారు. వరి వేస్తే ఉరివేసుకున్నట్లే అని కేసిఆర్ చెప్పారు.. కొనుగోలు కేంద్రాలు తెరమని చెప్పారు.. కానీ మేము మాత్రం వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించాం. పండించిన ప్రతిగింజను మద్దతుధరతో పాటు ఐదువందల రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామని చెప్పారు. రైతులు అమ్ముకున్న మూడురోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. తెలంగాణలో 66లక్షల ఎకరాలు వరిసాగుచేసి కోటిమెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి సాధించామని, దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండులక్షల రూపాయలు రుణమాఫీ చేశామని, రాష్ట్రంలోని 25లక్షల మంది రైతులకు గాను 21వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే పదేళ్ళలో 7లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మనకు అప్పచెప్పాడని సీఎం తెలిపారు. అసలు, వడ్డీలు కలిపి ప్రతినెలా 6500కోట్లు.. ఏడాదికి 65వేల కోట్లరూపాయలు చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎవరిమాటలు నమ్మవద్దు.. సంకాంత్రి తర్వాత రైతుభరోసా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతుంటే.. బిఆర్‌ఎస్ నేతల గుండెల్లో గుబులు పుడుతుందని చెప్పారు. 50వేల ఎకరాల్లో ఫోర్త్‌సిటీ ప్యూచర్ సిటీని సుందరంగా నిర్మిస్తానన్నారు. కొత్తనగరం నిర్మాణం చేసి అన్ని అందుబాటులో ఉండే విధంగా చూస్తానన్నారు.

మూసీ, ఈసా నదుల నీరు తీసుకువచ్చి కలుషితం లేకుండా.. కాలుష్యంలేని స్వచ్చమైన నీటిని తీసుకువచ్చే బాధ్యత నాదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఏక్ లింగాన్ని అడగండి.. కేసిఆర్‌ను అడగండి కావాలో.. వద్దో తెల్చుకోండి అన్నారు. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బిఆర్‌ఎస్ మొక్క మొలవదన్న విషయం కేసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఈసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నలమాద పద్మావతిరెడ్డి, వేముల వీరేశం, నేనావత్ బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బిఎల్‌ఆర్, కుందూరు జయవీర్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, మందుల శామ్యేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News