Saturday, November 23, 2024

వాస్తవాల వెల్లడికే శ్వేతపత్రం: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాగ్ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరికొన్ని వివరాలను బడ్జెట్ ప్రతులనుంచి సేకరించామన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ ఎవరినో కించపరచడానికో, తక్కువ చేసి చూపేందుకో లేక తాము ఇచ్చిన హామీలను ఎగవేసేందుకో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని స్పష్టం చేశారు. సమర్ధవంతమైన పాలన అందించేందుకే ఈ ప్రోగ్రెస్ రిపోర్టును రూపొందించామని చెప్పారు. 42 పేజీల శ్వేతపత్రంలో ఏ నాయకుణ్నీ తప్పు పట్టలేదన్నారు.

2014-15 సంవత్సరం నాటికి ఆర్బీఐ వద్ద తెలంగాణాకు మిగులు బడ్జెట్ ఉండేదని, కానీ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ఆర్బీఐ వద్ద ప్రభుత్వం అప్పులు చేస్తోందని, ఉద్యోగుల జీతభత్యాలకు, ఇతర ఖర్చులకు కూడా లైనులో నిలబడి అడుక్కుంటోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, దీంతో ఉద్యోగులు బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలు సక్రమంగా కట్టలేకపోవడంతో వారి సిబిల్ స్కోర్ దెబ్బతిందని ఆయన చెప్పారు. ఉద్యోగులకు అప్పు పుట్టని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రాభివృద్ధికోసం అన్ని పార్టీలనూ కలుపుకుని పోతామని రేవంత్ రెడ్డి చెప్పారు. అందులోభాగంగానే ప్రధానిని కలిసేందుకు తాను స్వయంగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడానని, ప్రధానమంత్రిని కలుద్దామని స్వయంగా ప్రతిపాదించానని రేవంత్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్దికి అన్ని పార్టీలతో చర్చిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News