- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రైతు బంధు పడలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018-19 యాసంగి రైతుబంధు వేయడానికి 5 నెలల సమయం తీసుకున్నారని గుర్తుచేశారు. 2019-20లో రైతు బంధు వేయడానికి 9 నెలలు పట్టిందని పేర్కొన్నారు. 2020-21లో రైతు బంధు వేయడానికి 4 నెలలు పట్టిందని, 2021-22లో 4 నెలలు తీసుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకుండానే రైతుబంధు ఇవ్వలేదని రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో రైతు బంధు వేస్తామని చెప్పినం.. అయినాసరే రైతు బంధు వేయలేదని రైతులను రెచ్చగొడుతున్నారు సీఎం తెలిపారు.
- Advertisement -