Monday, December 23, 2024

చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు దూరారు: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గత పాలనలో కాంగ్రెస్… కేసీఆర్ కు వివిధ పదవులు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి… ఎమ్మెల్యే పదవి లేకుండానే హరీశ్ రావును మంత్రిపదవి ఇచ్చారని తెలిపారు. కృష్ణ జలాల్లో మా వాటా మాకు ఉండాలని ఆనాడు కోట్లాడింది మా నాయకుడు పి జనార్ధన్ రెడ్డి… ఇక్కడున్న వారెవ్వరూ కొట్లాడలేదని.. కానీ, సొంతపార్టీపై పి జనార్ధన్ రెడ్డి కోట్లాడారని అన్నారు.

కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం, అవగాహన కాదుని.. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరని సీఎం అన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు.. కెకె మహేందర్ రెడ్డి సిరిసిల్లలో పార్టీని నిర్మించుకుని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కొట్లాడితే.. ఎన్ఆర్ఐ గా మేనేజ్ మెంట్ కోటాలో అమెరికా నుంచి కెటిఆర్ వచ్చి టికెట్ తీసుకుని.. కెకె మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారని అన్నారు. గత పాలన గురించి మాట్లాడాలంటే.. తాము సిద్ధమని చెప్పారు. జూన్ 2, 2014 కంటే మందుకు వరకు 55ఏళ్ల పరిపాలనలో ప్రతి అంశంపై మాట్లాడుకుందామని.. కానీ, ఇప్పుడు 2014, జూన్ 2 తర్వాత జరిగిన పరిపాలన, విధ్వంసంపై చర్చ జరుగుతుందని సీఎం రేవంత్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News