Monday, December 23, 2024

స్వల్ప అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం కారణంగా సిఎం రేవంత్ సోమవారం ఇంటిదగ్గరే ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపిసిఆర్ టెస్టు కూడా చేశారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జేఎన్-1 అనే న్యూ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే సిఎం రేవంత్ రెడ్డి అనారోగ్యం బారినపడటం ప్రజలను, కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇటీవల వరుస సమీక్షలు, సమావేశాలతో సిఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. సిఎం రేవంత్ అకస్మాత్తుగా జ్వరం బారిన పడటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయితే ఇటీవల సిఎంతో పాటు సమావేశాలు, సమీక్షల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News