Thursday, April 24, 2025

రూ.2,44,992కోట్లు

- Advertisement -
- Advertisement -

80,500 ఉద్యోగాలు జపాన్ పర్యటనలో
రూ.12,062కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
జనవరి దావోస్ పర్యటనలో రూ.1,78,950కోట్ల
పెట్టుబడుల రాక కాంగ్రెస్ ప్రభుత్వ
విధానాలతో ఆకర్షితులవుతున్న పెట్టుబడి
దారులు గేమ్ ఛేంజర్‌గా ఫ్యూచర్ సిటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి ఇప్పటివరకు సుమారుగా రూ.2,44,962 కోట్ల పెట్టబడులు, 80,500ల ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా ప్ర భుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఇలా గతంలో ఏ ప్రభుత్వం తీ సుకురాని విధంగా పెట్టుబడులను తీసుకురావడంతో పాటు యువతకు కూడా ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పించ డం విశేషం. ఈ నేపథ్యంలోనే జనవరిలో జరిగిన దావోస్‌లో పె ట్టుబడుల తరువాత జపాన్‌లో సిఎం రేవంత్‌రెడ్డి బృందం ఈ ఏ డు రోజుల పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడు ల ఒప్పందాలను చేసుకోవడంతో పాటు దాదాపు 30,500ల ఉ ద్యోగాలు వచ్చేలా జపాన్‌లోని ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్ర భుత్వం ఎంఓయూ చేసుకుంది. దీంతోపాటు జనవరిలో సిఎం రేవంత్‌రెడ్డి బృందం దావోస్‌లోని వరల్డ్  ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను తెలంగాణలో పెట్టించేలా ఒప్పందాలు చేసుకోవడం విశేషం.

2024లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు
జపాన్ పర్యటనలోనూ పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను చేరుకుంది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అంతర్జాతీయ సంబంధాలు, పరస్పర సహకార సంప్రదింపులు జరపడంలో కొత్త అధ్యాయానికి ప్రభుత్వం తెరతీసింది. జపాన్‌లో పేరొందిన కంపెనీలతో రూ.12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో దాదాపు 30,500 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. గతేడాది 2024 దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాగా, జనవరి 2025లో జరిపిన దావోస్ పర్యటనలో రూ.1,78,950 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం తెలంగాణకు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి (2023 డిసెంబర్) నుంచి ఇప్పటివరకు సాధించిన మొత్తం పెట్టుబడులు రూ. 2,44,962 కోట్లు కాగా, 80,500ల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

గేమ్ ఛేంజర్‌గా రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంటోంది. దీంతోపాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్ ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానమని మరోసారి ప్రపంచానికి రాష్ట్ర ప్రభుత్వం చాటిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్శిస్తుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News