Monday, December 23, 2024

వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్న సిఎం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 15వ తేదీ నుంచి 19వ తేదీల మధ్య దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సిఎంతో పాటు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు కూడా దావోస్‌కు వెళ్లనున్నారు.

ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సిఎం సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడుల అంశంపై వారితో చర్చించనున్నారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ‘ల్యాబ్ నుంచి లైఫ్ టు లైఫ్ -సైన్స్ ఇన్ యాక్షన్’ అనే అంశంతో ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సదస్సులో దేశంలోని కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News