Friday, December 20, 2024

16న ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పెండింగ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చించేందుకు సిఎం ఈ టూర్‌కు వెళుతున్నట్టుగా సమాచారం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ నిమిత్తం సిఎంతో పాటు, పలువురు రాష్ట్ర సీనియర్ నేతలతో ఏఐసిసి కొన్ని రోజులుగా చర్చలు సాగిస్తోంది. అయితే నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది.

ఈ క్రమంలో మరోసారి అధిష్టానం మంత్రివర్గ కూర్పుపై సమావేశం కానున్నట్టుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణతో పాటు ఇప్పటికే సిద్దం చేసిన 27 నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జాబితా, పిసిసి కార్యవర్గ సభ్యుల ఎంపిక వంటి విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నట్టుగా తెలిసింది. అయితే ఈ పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబులకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News