Wednesday, November 27, 2024

నేడు ఢిల్లీకి సిఎం

- Advertisement -
- Advertisement -

డిప్యూటీ సిఎం భట్టితో కలిసి సాయంత్రం 4.30 గంటలకు ప్రధానిని కలవనున్న రేవంత్

విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చకు అవకాశం

కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోనూ సమావేశం కానున్న రేవంత్, భట్టి

ఎల్లుండి నాగ్‌పూర్‌కు ముఖ్యమంత్రి

మన తెలంగాణ/ హైదరాబాద్:  సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర సమస్యలపై ప్ర ధాని మోడీతో వారు సమావేశం కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. నేటి సాయం త్రం 4.30 గంటలకు ప్రధాని ఫిక్స్ అయినట్టుగా తెలిసింది. అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపైనా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని వీరిద్దరూ కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ప్ర ధాని మోడీని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో క లిసి నేడు ఢిల్లీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వ ర్గాలు స్పష్టం చేశాయి. ప్రధానితో భేటీ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్కలు విభజన హామీలు, రా ష్ట్రానికి రావాల్సిన బకాయిలు, రాష్ట్రానికి సం బంధించిన ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సుమారు 10 సంవత్సరాలు కావస్తున్నా విభజన అంశాలైన 9,10 షెడ్యూల్‌లోని ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఇంకా కొలిక్కిరాకపోవడం, దీంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా మంజూరు చేయాలని సిఎం, డిప్యూటీ సిఎంలు ప్రధాని మోడీని కలి సి విజ్ఞప్తి చేయనున్నట్టుగా తెలిసింది.రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమకు సహకరించాలని ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసిన సిఎం రేవంత్, ప్రస్తుతం ఆ దిశగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ వ ర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేం ద్రంతో ఎటువంటి గొడవలు, బేషజాలకు పోకుం డా సఖ్యతతో మెలగాలని సిఎం ఇటీవలే అసెంబ్లీ వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని పరిస్థితులపై అధిష్ఠానానికి…
నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై నేడు ఢిల్లీ పెద్దలతో వీరిద్దరూ చర్చించనున్నట్టుగా తెలిసింది. వీటితో పాటు ఆరుగురిని మంత్రివర్గంలో తీసుకునే విషయంతో పాటు ఆరు ఎంఎల్‌సి పోస్టులకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండడంతో వీటన్నింటిపై రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు నామినేటెడ్‌తో పాటు మిగతా పోస్టుల కోసం వేచి చూస్తున్నా రు. దీంతో యాభైకి పైగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండడం తో పార్టీ కోసం పని చేసిన వారితో పాటు టికెట్లు త్యాగం చేసిన నాయకులకు కూడా ఈ పదవులను ఇచ్చేందుకు కొన్ని రోజులుగా పార్టీలో అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిఎం, డిప్యూటీ సిఎంలు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించనున్నారు.అదేవిధంగా ఎంఎల్‌సి స్థానాలకు అభ్యర్థులు, పార్లమెంట్ ఎన్నికలు, లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, ఆసక్తి చూపుతున్న నాయకులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
అన్ని ఎంపి సీట్లు గెలుచుకునేలా..
తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లోనూ గెలిచేందుకు అవసరమైన కార్యాచరణ, ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర నాయకత్వం సమాయత్తం అవుతోంది. దీంతోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మార్పు, కొత్తగా ఇన్‌ఛార్జి బాధ్యతలు దీపాదాస్ మున్షీకి అప్పగించడం తదితర అంశాలపై కూడా వీరిద్దరూ అధిష్ఠానంతో చర్చించే అవకా శం ఉన్నట్లు సమాచారం. నేడు ఈ భేటీ అనంతరం బుధవారం నాగపూర్‌లో జరుగనున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News