Sunday, December 22, 2024

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు(బుధవారం) ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈరోజు మద్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీలో సాయంత్రం ఎఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టి కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం జరగనుంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమండ్ తో లోక్ సభ ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులపై చర్చించనున్నారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్.. ఇప్పటివరకు 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News