- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. కొద్దిసేపటిక్రితమే ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లారు. ఆయనతోపాటు టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జరిగే బీసీ సంఘాల మహాధర్నాలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిఎం తన సంఘీభావం తెలుపనున్నారు.
అలాగే, రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
- Advertisement -