Sunday, January 19, 2025

5న జార్ఖండ్‌కు సిఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 5వ తేదీన జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో పర్యటించనున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేల కోసం హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరంతా శామీర్‌పేటలోని లియోని రిసార్ట్‌లో ఉన్నారు. బలపరీక్ష నేపథ్యంలో నేడు సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలు వారి రాష్ట్రానికి ప్రయాణం కాబోతున్నారు.

ఆ మరుసటి రోజు 5వ తేదీన సిఎం రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లనున్నారు. దీంతో ఈ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. వాస్తవానికి ఫిబ్రవరి 5వ తేదీన తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు పర్యటన షెడ్యూలు కూడా ఫిక్స్ అయింది. కానీ, జార్ఖండ్ రాజకీయ పరిణామాలతో కొడంగల్ టూర్‌ను రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి జార్ఖండ్‌కు వెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News