- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు(సోమవారం) భూభారతి పోర్టల్ ను ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మాదాపూర్‌లోని శిల్పకలావేదికగా ఈ పోర్టల్ ను సిఎం ప్రారంభిస్తారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా మూడు మండలాల్లోనే దీన్ని అధికారులు అమలు చేయనున్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో భూ భారతి పోర్టల్ పై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భూ భారతికి సంబంధించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిన మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సిఎం సూచించారు. ఈ పైలట్ ప్రాజెక్టులో రైతుల సలహాలు, సూచనలు స్వీకరించాలని.. వారి సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, సదస్సుల్లో ప్రజల సూచనల ఆధారంగా పోర్టల్ అప్డేట్ చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
- Advertisement -