Sunday, January 19, 2025

నేడు సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం, గీతం తుది రూపకల్పన నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల నేతలతో చర్చించేందుకు సచివాలయంలో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కళాకారుడు రుద్ర రాజేశం, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర చిహ్నం అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక, రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. జయ జయహే తెలంగాణ గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణి బృందం పాడి వినిపించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News