Monday, December 23, 2024

నన్నెవరూ పిలవలేదు: దేవులపల్లి ప్రభాకరరావు

- Advertisement -
- Advertisement -

విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కావాలంటూ తనను ఎవరూ పిలవలేదని ట్రాన్స్ కో, జెన్కో సిఎండీ దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టం చేశారు. తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కరెంటు లెక్కల్లో అవకతవకలు జరిగాయనీ, అవి తేలేవరకూ సిఎండీ దేవులపల్లి రాజీనామాను ఆమోదించవద్దనీ ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే విద్యుత్ శాఖపై జరిగే సమీక్షా సమావేశానికి ఆయనను పిలవాలని సిఏం అధికారులను ఆదేశించారని కూడా తెలిసింది. అయితే తనకు ఎలాంటి సమాచారం లేదని, ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకుంటానని దేవులపల్లి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News