- Advertisement -
శ్రీరామనవమి సందర్భంగా నేడు(ఆదివారం) భద్రాచలంలో జరుగనున్న ఉత్సవాల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి దంపతులు సమర్పించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
- Advertisement -