Monday, January 13, 2025

రేపు ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హస్తినాకు వెళ్లనున్నారు. సోమవారం ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై చర్చించే అవకాశం ఉంది.

అలాగే మంత్రివర్గ విస్తరణపైనా కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. కాగా, మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి తరఫున సీఎం రేవంత్ ప్రచారం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. మహారాష్ట్రంలో కాంగ్రెస్ ఘోర పతనాన్ని చవిచూసింది. అక్కడ కేవలం 16 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News