Friday, January 10, 2025

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం గాంధీభవన్‌లో దీప్‌దాస్ మున్షీ అధ్యక్షతన 13 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై అభిప్రాయ సేకరణ జరిపారు. అనంతరం దీప్‌దాస్ మున్షీ సారథ్యంలో ఎఐసిసి నేతలు సిఎం రేవంత్ నివాసంలో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభిప్రాయ సేకరణకు సంబంధించిన అంశాలపై దీప్‌దాస్‌మున్షీ, సిఎం రేవంత్‌ల మధ్య చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలలో భాగంగా సిఎం రేవంత్ సైతం తన అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం.

కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం అంత ఉండకపోవచ్చన్న చర్చ చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఒకట్రెండు చోట్ల కొత్తవారికి అవకాశమిచ్చినా అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం సైతం వ్యక్తమైనట్లు సమాచారం. అయితే అభిప్రాయ సేకరణ సందర్భంగా కొత్తవారికి అభ్యర్థిత్వాలు కట్టబెట్టే తీరుపై పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి విదితమే. మిగతా 13 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనలైజ్ చేసేందుకు సిఎం రేవంత్ ఢిల్లీ బాట పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News