Saturday, February 1, 2025

రేపు ఢిల్లీకి సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 3 వ తేదీతో ప్రచారం ముగుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు సిఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు.

ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ తరహాలోనే గ్యారంటీలతో కూడిన హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై అక్కడి ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. మరోవైపు ఎపి నుంచి సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీయే ప్రభుత్వం తరపున ఢిల్లీలో ప్రచారానికి సిద్ధమయినట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో తెలుగు రాజకీయ నేతలు ప్రచారం కీలకంగా మారనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News