Friday, December 27, 2024

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య ఆయన విదేశాలలో పర్యటించనున్నారు. దావోస్, లండన్‌లలో ఆయన పర్యటిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు. దావోస్ సదస్సులో భాగంగా ప్రముఖ ప్రపంచ కంపెనీలకు చెందిన సిఇవొలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News