Tuesday, January 14, 2025

పెట్టుబడులకు పెట్టని కోట

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో సానుకూలతలను ప్రపంచానికి
పరిచయం చేయండి మన పారిశ్రామిక
విధానం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది ప్రభుత్వ
పథకాలు,అభివృద్ధి పనులు రాష్ట్రాన్ని
బలమైన ఆర్థికవ్యవస్థగా నిలబెట్టాయి
ఐటి, పరిశ్రమలశాఖ అధికారులతో సిఎం
రేవంత్‌రెడ్డి సమీక్ష గత దావోస్ పర్యటనలో
పెట్టుబడుల సమీకరణ, పురోగతిపై ఆరా
ఈ నెల 16 నుంచి 22 వరకు మళ్లీ సింగపూర్,
దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి బృందం

మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడులకు గమ్యస్థానంగాఇప్పటికే తెలంగాణ దేశంలో అం దరి దృష్టిని ఆకర్షిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి అ న్నారు. దేశ, విదేశాల్లో పేరొందిన కంపెనీ లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అ నుకూలమైన వాతావరణముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతు న్న హైదరాబాద్ పరిధిలో ఉన్న సానుకూలతల ను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సిఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోందని సి ఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని ఆయన అన్నారు. జూ బ్లీహిల్స్‌లోని నివాసంలో పరిశ్రమల శాఖపై అ ధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సి ఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం ప్రత్యే క కార్యదర్శి అజిత్ రెడ్డి, టిజిఐఐసీ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జనవరి 20వ తేదీ నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. గత ఏడాది ప్రభుత్వంతో ఒ ప్పం దం చేసుకున్న ఏయే కంపెనీ లు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయి. అవి ఏయే దశ లో ఉన్నాయని సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పె ట్టుబడులు వచ్చాయి. 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరా యి. వీటిలో దాదాపు 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అధికారులు సిఎంకు వివరించా రు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయని, ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. కంపెనీల వారిగా పురోగతిని మంత్రి శ్రీధర్ బాబుతో సిఎం చర్చించారు.

ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్, 20 నుంచి 22వ తేదీ వరకు ముఖ్యమంత్రి దావోస్‌లో పర్యటించనున్నారు. సిఎంతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉంటా రు. సింగపూర్‌లో స్కిల్ వర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ ఆరు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు, అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల ప్రణాళికను అధికారులు సిఎంకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News