Sunday, January 19, 2025

సిఎం హోదాలో తొలిసారి యాదాద్రికి రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. సోమవారం యాదాద్రి భువనగి, భద్రాద్రి కొత్తగూడెంలో సిఎం రేవంత్ పర్యటించనున్నారు.  ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వస్తి పూజలలో సిఎం రేవంత్ తోపాటు పలువురు మంత్రలు పాల్గొననున్నారు.

స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భద్రాచలం వెళ్తారు. అక్కడ భద్రాచలం సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News