Sunday, December 22, 2024

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన రాష్ట్ర శాసనసభ ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత రాష్ట్ర శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయిస్తున్నారు.

మెదటగా ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ప్రమాణం చేశారు. ఒక్కోక్క ఎమ్మెల్యేతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. అనంతరం స్పీకర్ ను ఎన్నుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈరోజు ఉదయం రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.

స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు గడ్డం ప్రసాద్ స్పీకర్ నోటిఫికేషన్ కు నామినేషన్ వేయనున్నారు. ఏకగ్రీవంగా ఆయనను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News