Sunday, December 22, 2024

డ్రైవర్ లేని కారులో ప్రయాణించిన సిఎం రేవంత్ రెడ్డి (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

శాన్ ఫ్రాన్సిస్ కో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లేని కారులో రేవంత్ ప్రయాణించాడు. ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వాహన ప్రదర్శనను వీక్షించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అమెరికా కంపెనీలు ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి పర్యటనతోనే రూ.31532 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడంతో ఆయన పర్యటన విజవంతమైందని రాష్ట్ర పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని 19 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం విధితమే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని దక్షిణ కొరియాకు వెళ్లారు.  

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News