Sunday, January 19, 2025

కాళేశ్వరం నీళ్లు లేకున్నా.. రికార్డుస్థాయిలో పంట: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా వరి పంట సాగు జరిగిందని చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని సిఎం తెలిపారు. ఈ సంవత్సరంలో 66.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైందని, 153 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందనే వార్తను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా రైతులు ఈ ఘనత.. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరంలోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు చెప్పడంతో నీటిని నిల్వ చేయకుండా కిందకు వదిలేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. నాణ్యత లోపంతోనే పిల్లర్లు కుంగినట్లు ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కమిషన్ వేసి దర్యాప్తు చేస్తోంది ప్రభుత్వం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News