Monday, January 20, 2025

నాడు కుటుంబ పద్దు..నేడు ప్రజల పద్దు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించింది. రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. నాడు కుటుంబ పద్దు, నేడు ప్రజల పద్దు అని డిప్యూటీ సీఎం భట్టి తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. శనివారం శాసన సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమంలో కొత్త శకానికి నాంది.. తెలంగాణ పునర్ నిర్మాణానికి తొలి అడుగు.. అని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News