Sunday, December 22, 2024

రేపు మేడారం జాతరకు సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆసియాలో అతి పెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న వెళ్ళనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు., మేడారం జాతర బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ జాతర ఈ నెల 24 వరకు కొనసాగుతోంది. రెండేళ్ళకొకసారి జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే గాకుండా వివిధ రాష్టాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ముఖ్యమంత్రి రాక సంధర్భంగా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా జాతరకు వస్తున్నందున అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News