Sunday, June 30, 2024

నాలుగు రోజులు…నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ

- Advertisement -
- Advertisement -

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుంబిగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో నలుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడంతో పాటు తెలంగాణ నుంచి ఎంపికైన లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ కలుస్తున్నారు. హైదరాబాద్‌లో రక్షణ భూముల బదలాయింపు, రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఇళ్ల నిర్మాణం, నగరాల్లోని పెండింగ్ పనుల పూర్తి, వైద్య ఆరోగ్య శాఖ బకాయిల మంజూరు విషయమై కేంద్ర మంత్రులతో సమావేశమై వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News