Sunday, April 20, 2025

మారుబెని భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

సిఎం జపాన్ పర్యటనలో తొలిరోజే కీలక ఒప్పందం ఫ్యూచర్ సిటీలో
రూ. వెయ్యి కోట్లతో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు మారుబెని కంపెనీ
సంసిద్ధత లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సిఎం సమక్షంలో ఒప్పందం
జైకా ఉన్నతస్థాయి ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ మెట్రోరైల్
రెండోదశకు రూ.11,693కోట్ల రుణం ఇవ్వాలని వినతి మూసీ
పునరుజ్జీవనం, ట్రిపుల్ ఆర్, ఒఆర్‌ఆర్ రేడియల్ రోడ్లకు ఆర్థిక సాయం
అందించాలని విజ్ఞప్తి రుణ సహాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని
సంప్రదించాలని సిఎంకు జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సూచన

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రము ఖ జపాన్ కంపెనీ మారుబెనీ ముం దుకొచ్చింది. సిఎం రేవంత్‌రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే ఈ కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేసేందుకు మారుబెనీ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తం గా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోం ది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యు త్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు,

ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో ఈ కం పెనీ వ్యాపారాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మారుబెనీ కంపెనీలో 50వేల మంది పని చేస్తున్నారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రీయల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పె ట్టుబడును ఆకర్షించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు సిఎం రేవంత్‌రెడ్డిని గురువారం కలుసుకున్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై వారు చర్చించి ఈ ఒప్పందం చేసుకున్నారు.

30 వేల ఉద్యోగాలు
ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుతో జపాన్‌తో పాటు వివిధ దేశాల కంపెనీల ద్వారా దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు రావచ్చన్న అంచనా ఉంది. మారుబెనీ కంపెనీ దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ జనరేషన్ ఇండస్ట్రీయల్ పార్కును అభివృ ద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుపై లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, మారుబెనీ కంపెనీ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. జపాన్ పరిశ్రమలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో ప్లాంట్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రీయల్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు.

ఏరోస్పేస్, డిఫెన్స్
మారుబేని ఇండస్ట్రీయల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెట్టనుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదేనని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సుమారు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.ఫ్యూచర్‌సిటీలో మొదటి ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసేందుకు మారుబెనీ కంపెనీ ముందుకు రావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగా..
తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని, మారుబేని కంపెనీకి ప్రభుత్వం తరఫున తగిన మద్దతు ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. భారత్‌తో జపాన్‌కు అనేక ఏళ్లుగా స్నేహ సంబంధాలు ఉన్నందున పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని సిఎం అన్నారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా మారుబేని పెట్టుబడులకు ముందుకురావటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ముఖమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకున్న విధానాలను మారుబేని నెక్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అధికారి దై సకాకురా అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించిన దై సకాకురా రాష్ట్రంలోని అవకాశాలను వినియోగించుకునేందుకు ముందు వరుసలో ఉంటామని తెలిపారు.

మెట్రో రైలుకు రూ.11,693కోట్ల కేటాయించండి: జైకాకు విజ్ఞప్తి
జపాన్‌లో సిఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ వివిధ పేరుమోసిన కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతోంది. అందులో భాగంగానే గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది. ము ఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని జైకాను కోరింది. పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలు,

ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్‌ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జైకా ప్రతినిధులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. 24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని జైకా బృందానికి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం అంటే రూ.11,693 కోట్లు రుణం అందించి మద్దతు ఇవ్వాలని సిఎం రేవంత్ బృందం కోరింది. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుందని సిఎం చెప్పారు. మెట్రోతో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు, కొత్త రేడియల్ రోడ్లకు నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశా రు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న తన ఆలోచనలను సిఎం వారితో పంచుకున్నారు. జైకాకు, తెలంగాణతో ఏళ్లకేళ్లుగా సంబంధాలున్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా అన్నారు. మెట్రో రైలు విస్తరణతో పాటు, అర్హతలున్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రితో పేర్కొన్నారు.

సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన బృందం
సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్‌లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అధికారిక పర్యటనలో భాగంగా సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని గురువారం సందర్శించింది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. ఉత్పత్తులతో పాటు వారి పని తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైర్పో వివరణాత్మక చర్చలు జరిపింది. యానిమేషన్, విఎఫ్‌ఐ, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే ఆధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి తన భవిష్యత్ విజన్‌ను వారితో పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News