Monday, January 20, 2025

నేడు కేరళకు రేవంత్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సిఎం రేవంత్ కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం రేవంత్ హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం అలిప్పీ నియోజకవర్గంలో గురువారం వయనాడు నియోజకవర్గంలో సిఎం రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. అలిప్పీ నియోజకవర్గం నుంచి ఏఐసిసి నాయకులు కెసి వేణుగోపాల్ పోటీ చేస్తుండగా వయనాడు నియోజకవర్గం నుంచి ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెండు రోజుల పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు.

ఎపి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ సిఎం ప్రచారం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ అధినాయకత్వం సిఎం రేవంత్‌ను ఆదేశించింది. ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు మంగళవారం మహారాష్ట్రలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో సిఎం రేవంత్ పర్యటన రద్దైంది.

రాష్ట్ర పిసిసి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్ భారీగా పెరిగింది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సిఎం రేవంత్ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవల వైజాగ్‌లో ఏపిసిసి నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి హాజరుకాగా అక్కడ విశేష స్పందన లభించింది.
ఈనెల 19వ తేదీన మహబూబ్‌నగర్, మహబూబాబాద్ సభల్లో
అనంతరం సిఎం రేవంత్ ఈనెల 18వ తేదీన గురువారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 19వ తేదీన మహబూబ్‌నగర్, మహబూబాద్‌లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News