Tuesday, January 21, 2025

నేడు వరంగల్‌కు సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రడ్డి వరంగల్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. నేడు (శనివారం) మధ్యాహ్నాం 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి సిఎం రేవంత్ బయల్దేరి వరంగల్ కు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. దీంతోపాటు గ్రేటర్ వరంగల్‌పై సమీక్ష చేయనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్‌లో సిఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు.

నేడు మధ్యాహ్నాం 12 : 40 గంటలకు..
నేడు మధ్యాహ్నాం 12 : 40గంటలకు హెలికాఫ్టర్‌లో బేగంపేట్ విమానాశ్రయం నుంచి వరంగల్‌కు బయల్దేరుతారు. మధ్యాహ్నాం 1 : 30 నిమిషాలకు టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుంటారు. మధ్యాహ్నాం 1 : 30 గంటల నుంచి 1 : 50 గంటల వరకు టెక్స్ టైల్ పార్క్ సందర్శించి కొత్త కంపెనీల స్థాపన, ఉపాధి కల్పన చేస్తారు. మధ్యాహ్నాం 1 : 50 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి రంగంపేట మల్టీ స్పెషలిటీ ఆస్పత్రి వద్దకు వెళ్తారు. మధ్యాహ్నాం 2 : 10 గంటల నుంచి 2 : 30 గంటల వరకు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు.

మధ్యాహ్నాం 2 : 30 గంటలకు హనుమకొండ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు. మధ్యాహ్నాం 2 : 45 గంటలకు వరంగల్‌లో మహిళా శక్తి క్యాంటీన్‌ను సిఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నాం 3 గంటల నుంచి 5 : 30 గంటల వరకు గ్రేటర్ వరంగల్‌పై సమీక్ష చేస్తారు. సాయత్రం 5 : 40 గంటలకు ఓ ప్రైవేటు కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. సాయంత్రం 6 : 30 గంటలకు ఆర్ట్ కాలేజీ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి 7 :20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News