Sunday, December 22, 2024

రేపు యాదగిరిగుట్టకు సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు యాదగిరిగుట్టకు కుటుంబ సమేతంగా రానున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సిఎం పర్యటన విజయవంతంగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. తన జన్మదినం సందర్భంగా మొదట కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా యాదగిరిగుట్టకు సిఎం రేవంత్ చేరుకుంటారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధిలో భాగంగా పెండింగ్ పనులపై వైటిడిఏ అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇంతవరకు ఆలయంలో జరిగిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులు ఏఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకొని వాటి గురించి అధికారులతో చర్చించనున్నారు.

వలిగొండ నుంచి మూసీ వెంట పాదయాత్ర
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పర్యటన అనంతరం సిఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని వలిగొండ నుంచి మూసీ నది వెంట పాదయాత్ర నిర్వహించనున్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుంటారు. మూసీ పరీవాహక ప్రాంత రైతులతో మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శిస్తారు.అనంతరం మూసీ పరీవాహక ప్రాంత రైతులతో సమావేశం అవుతారు.

రెండో సారి యాదాద్రికి సిఎం
రేవంత్ రెడ్డి సీఎం హోదాలో రెండోసారి యాదగిరిగుట్ట క్షేత్రానికి రానున్నారు. మొదటగా మార్చి 11వ తేదీన యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజున క్షేత్రాన్ని మంత్రులతో కలిసి దర్శించారు. తిరిగి తన జన్మదిన సందర్భంగా ఈనెల 8వ తేదీన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించనున్నారు. సిఎం హోదాలో ఆయన మొదటిసారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సిఎం రేవంత్ రెడ్డి పాదయాత్రను పురస్కరించుకొని సంగెం వద్ద మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాచకొండ సిపి సుధీర్ బాబు, కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డిలు పరిశీలించారు. యాదగిరిగుట్టలోని వైటిడిఏ గెస్ట్ హౌస్‌లో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ భాస్కరరావు జిల్లా అధికారులతో ఆలయ పరిసరాలను కలెక్టర్, సిఎం సెక్యూరిటీ అధికారులు భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News