Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్ధించానని చెప్పారు.శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలన్నారు.

కాగా, బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత సిఎంకు టిటిడి ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News