Monday, January 27, 2025

ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీవనదుర్గాభవాని మాత అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగాప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా ఏడుపాయలకు చేరుకున్న సిఎంకు స్థానిక ఎంఎల్‌ఎ మైనంపల్లి రోహిత్‌రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్‌పి ఉదయ్‌కుమార్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఇఒ చంద్రశేఖర్ సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. తదుపరి స్థానిక ఎంఎల్‌ఎ మైనంపల్లి రోహిత్‌రావు, మెదక్ ఎంపి రఘునందన్‌రావు, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్,

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, మాజీ ఎంఎల్‌ఎలు హనుమంతరావు, మదన్‌రెడ్డి తదితరులతో కలిసి ఏడుపాయల ఆలయ అభివృద్దికి రూ.35 కోట్లు ఏడుపాయల నుంచి కమాన్ వరకు 7 కిలోమీటర్లకు ఫోర్‌లైన్ రోడ్డు, డివైడర్స్, హైమాస్ట్ స్ట్రీట్ లైట్స్‌లకు శంకుస్థాపన చేశారు. ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి రూ.5 కోట్ల చెక్కును అందించారు. ఎస్‌టి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ నిధులు కింద రోడ్ల నిర్మాణానికి రూ.52 కోట్ల 76 లక్షలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో మెదక్ చర్చికి చేరుకున్నారు. సిఎం రాకతో ఏడుపాయల దుర్గ అమ్మవారి ప్రాంతాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులతో ఏడుపాయల క్షేత్రం కిక్కిరిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు నాయకులు, ప్రజలు ఉత్సాహం చూపారు.

సిఎంకు ప్రతిపాదనలు అందించిన ఎంఎల్‌ఎ రోహిత్‌రావు
స్థానిక ఎంఎల్‌ఎ మైనంపల్లి రోహిత్‌రావు ఏడుపాయల ఆలయ అభివృద్ధికి, మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రతిపాదనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి సురేష్‌శెట్కార్, ఎంఎల్‌ఎలు లక్ష్మీకాంతారావు, సంజీవరావు, జిల్లాగ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, నీలం మధు ముదిరాజ్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ సంగీత, ఐజి చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News