Thursday, January 2, 2025

కన్హా శాంతివనం ప్రపంచానికి ఆదర్శం

- Advertisement -
- Advertisement -

పర్యావరణం, మహిళా
సాధికారత, విద్యారంగాల్లో సంస్థ
కృషి అభినందనీయం
సమాజహితం కోరుతూ
శాంతివనం ఏర్పాటు చేసిన
కమలేశ్ పాటిల్ అందరికీ స్ఫూర్తి
శాంతివనంలో కలియతిరిగిన
ముఖ్యమంత్రి బృందం

సంస్థ చేస్తున్న కృషి
అభినందనీయం
కొనియాడిన ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి పద్మభూషణ్
కమలేష్‌పాటిల్ (దాజీ)కి
ప్రత్యేక అభినందనలు
గాలిబుడగ మొక్క నాటిన సిఎం
మన తెలంగాణ-/నందిగామ: ప్రపంచంలో నే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా విరాజిల్లుతు న్న కన్హా శాంతివనం తెలంగాణకే తలమానికమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ నియోజకవ ర్గం, నందిగామ మండల పరిధిలోని చే గూ రు గ్రామ శివారులో గల కన్హా శాంతివనా న్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కన్హాశాంతివన నిర్వాహకులు, పద్మభూషణ్ కమలేష్‌పాటిల్ (దాజీ)ని ప్రత్యేక అభినందించారు. కన్హా శాంతివనం రాష్ట్రంలో ఏ ర్పాటు కావడం మనందరికీ గర్వకారణమ ని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లా డుతూ..సుస్థిరత,అటవి పెంపకం, మహి ళా సాధికారత, విద్యారంగాల్లో మనస్ఫూర్తి గా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని ప్ర స్తుతించారు. ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీ వితాలను మెరుగుపరచుకోవాలని, సమాజహితం కోసం రెవా దాజీ దార్శనికత, నిశిత మార్గదర్శకత్వంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన కన్హాశాంతివనాన్ని ఏర్పాటు చే య డం శుభపరిణామమని అన్నారు. కన్హాశాం తి వనం పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుండ డం మనందరికీ ఆదర్శనీయమన్నా రు.

ప్ర పంచ దేశాల నుంచి తెచ్చిన మొక్కలు కన్హాశాంతి వనంలో దర్శనమిస్తున్నాయని అన్నా రు. అనంతరం రెయిన్ ఫారెస్ట్, ఫెసిలిటీ వ ద్ద ఉన్న టిష్యూ కల్చర్ ల్యాబ్‌ని ప్రత్యేకంగా పరిశీలించి గాలిబుడగ (హిల్డెగార్డియా పా పులిఫోరియా) మొక్కను సిఎం నాటారు. క న్హా శాంతివన నిర్వాహకులు రెవ దాజీ మా ట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ రామచంద్రమిషన్‌ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. మానవుడి జీవితాన్ని హృదయపూర్వకంగా మెరుగుపరిచేందుకు ఎలాంటి స్వార్థం లేకుండా కృషి చేస్తున్న త మ సంస్థను సిఎం అభినందించడం మరిచిపోలేని అనుభూతిగా భావిస్తున్నామని అన్నారు. భూమిపై స్వర్గాన్ని నిర్మించడమే త మ ముందున్న లక్షమని, అందుకోసం పూ ర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. 1945లో శాంతి,ఆనందం, జ్ఞానాన్ని తీసుకురావల న్న లక్షంతో రామచంద్రమిషన్ ద్వారా బో ధనగా లాంఛనప్రాయంగా మార్చామని అన్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, షాద్‌నగర్ ఎంఎల్‌ఎ వీర్లపల్లి శంకర్, చేవెళ్ల ఎంఎల్ కాలె యాదయ్య, మాజీ ఎంపిపి శివశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News