Friday, December 20, 2024

కొడంగల్ ను కోకాపేట చేస్తా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: నాకు అన్ని ఇచ్చిన కొడంగల్ నియోజకవర్గ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అభివృద్దిలో కొడంగల్‌ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే సువర్ణ అవకాశం మనకు వచ్చిందని నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేయడమే లక్షంగా తాను ప ని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా రు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు వచ్చారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూ త్‌లో ముఖ్యమంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కొడంగల్‌లో ని ముఖ్యమంత్రి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి మా ట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ ప్రజలు త నకు అన్నీ ఇచ్చారన్నారు. నియోజకవర్గ ప్రజ ల ఆశీర్వాదంలో ప్రస్తుతం తాను రాష్ట్రంలో ఉ న్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానన్నారు. కొడంగల్ నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు ఒక్క సారి తప్ప కనీసం మంత్రి పదవి కూడ రాలేదన్నారు.

కాని ప్రస్తుతం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందన్నారు. ఇంత వరకు అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అందుకు సంబంధించి అధికారులకు అన్ని రకాలుగా అదేశాలు జారీ చేశామన్నారు. నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాల, పారా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, 200 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి, గురుకుల పాఠశాలలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఆయువు పట్టులాంటి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గతంలో ఉన్నత చదువులు చదివేందుకు నియోజకవర్గ వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం మనం నిర్వహించబోయే అభివృద్ధి పనుల కారణంగా ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాల వారు సైతం కొడంగల్‌కు వచ్చేలా నియోజకవర్గ అభివృద్ది కొనసాగిద్దామన్నారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులతో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొల్పాలనుకున్న కంపెనీలన్నీ కొండగల్‌కు తరలి రావాలన్నారు.

ప్రస్తుతం కోకాపేటలో ఉన్న ఎకరం రూ.100 కోట్లు కొడంగల్‌లో సైతం పలికే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి కొనసాగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా తన దృష్టి కొడంగల్‌పై ఉంటుందన్నారు. కొడంగల్ ప్రాంతంలో భారీ ఎత్తున సున్నపు నిక్షేపాలు ఉన్నా గత పాలకుల నిర్లక్షంతో నియోజకవర్గంలో కంపెనీలు రాలేదన్నారు. త్వరలోనే కొడంగల్‌కు సిమెంట్ కంపెనీలు, పార్మా కంపెనీలు తరలి వస్తాయన్నారు. అందుకుగాను ఇక్కడి ప్రజలు కంపెనీలకు భూములు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కంపెనీల ఏర్పాటుతో నియోజకవర్గంలో యువతకు భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయన్నారు. కంపెనీల ఏర్పాటు జరిగితే నియోజకవర్గంలో భూముల విలువ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతుందన్నారు. భూములు ఇవ్వకపోతే అభివృద్ధిని అడ్డుకున్నట్లే అన్న ముఖ్యమంత్రి భూ సేకరణలో పట్టా భూములకు,అసైన్డ్ భూములకు ఒకే రకమైన నష్ట పరిహారం చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. భూ సేకరణకు సహకరిస్తే నియోజకవర్గ అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. నియోజకవర్గానికి మేలు చేకూరేలా ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయాలన్నదే తన ఆకాంక్ష అని

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50 వేల భారీ మెజారిటీ రావాలని అందుకు తగిన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికలలో పని చేయాలని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అందుకుగాను ప్రతి మండలానికి 5 గురు సభ్యులతో ఒక కమిటీని నియమించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నియోజకవర్గ, బూత్ స్థాయిలలో కార్యకర్తలు కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పార్లమెంటు అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ గురునాథ్‌రెడ్డి, ఎంపీపీ ముద్దప్పదేశ్‌ముఖ్ నాయకులు శ్రీరాంరెడ్డి, నందారం ప్రశాంత్, యూసుఫ్, వెంకట్‌రావ్, వెంకట్‌రెడ్డి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News