Wednesday, December 25, 2024

సిఎం వర్సెస్ కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు అంశంపై అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని బుధవారం శాసనసభలో ముక్తకంఠంతో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అధికార విపక్షాల మధ్య మాటల యు ద్ధం నడిచింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కెటిఆర్ మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం కొనసాగింది. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి మాట్లాడుతూ, కెటిఆర్ అవగాహనారాహిత్యంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కెసిఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ ‘మాకు జవాబు చెప్పండి చాలు, మీ స్థాయి మేము చాలా… మీకు కెసిఆర్ అక్కర్లేదు అని అనడంతో రే వంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రే వంత్‌రెడ్డి మాట్లాడుతూ, తండ్రి పేరు చెప్పుకొని తాను మంత్రిని కాలేదని, కింది స్థాయి నుంచి ఎది గి ముఖ్యమంత్రిని అయ్యానని పేర్కొన్నారు. కెటిఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అనుకున్నానని, అంతకంటే దారుణమని ఎద్దేవా చేశారు.

ఆ వెంటనే కె టిఆర్ స్పందిస్తూ, రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో సిఎం అయ్యారని మేమూ అనొచ్చునని బదులిచ్చా రు. తండ్రి పేరు చెప్పుకొని వచ్చానని సిఎం రాహుల్‌గాంధీని అంటున్నారో..రాజీవ్‌గాంధీని అంటున్నారో తెలియదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మళ్లీ కౌంటర్ ఇస్తూ, పేమెంట్ కోటాలో సిఎంను కాలేదని, ఇటీవల బిఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకుని వచ్చారని ఆరోపించారు. అందుకు కెటిఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డి చిన్న వయస్సులోనే సీఎం అయ్యారని, చిన్న వయస్సులోనే సీఎం అయినందుకు రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కష్టపడే ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. తాము ఏం మాట్లాడాలో కూడా మీరే చెబితే ఎట్లా ..? మంత్రులను, స్పీకర్‌ను ఉద్దేశించి కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర హక్కులను శాసించి సా ధించుకోవాలని, యాచిస్తే ఏమీ రాదని అన్నారు. కేంద్రం వివక్షను ఎండగట్టడంలో తాము సహకరిస్తామని తెలిపారు.

ఇంతకాలానికి కాంగ్రెస్ సర్కార్‌కు ఢిల్లీతత్వం బోధపడింది
బిఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేశామని, కేంద్రం నుంచి రావలసిన నిధుల కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశామని కెటిఆర్ అన్నారు. కేంద్రం సాయం చేయకపోయినా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతకాలానికి ఢిల్లీతత్వం బోధపడిందని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతామని స్పష్టం చేశారు. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడామని, మోదీ సర్కారుపై తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసినట్లు వ్యాఖ్యానించారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేం ఇబ్బందని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశిస్తూ కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News