Thursday, January 9, 2025

మార్చికల్లా డిపిఆర్‌లు

- Advertisement -
- Advertisement -

యుద్ధప్రాతిపదికన విమానాశ్రయం, శామీర్‌పేట, మేడ్చల్ మెట్రోలకు
కేంద్రం నుంచి అనుమతులు సాధించాలి ఏప్రిల్ చివరినాటికి
టెండర్లు పిలవాలి హెచ్‌జిసిఎల్ కింద రేడియల్ రోడ్లు నిర్మించాలి
సమీక్షా సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ :మార్చి నెలాఖరుకు మెట్రోల డిపిఆర్‌లను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, శామీర్‌పేట్-, మేడ్చల్ మెట్రో రైళ్లు ఒకే చోటు నుంచి ప్రారంభం కా వాలని, ఇందుకోసం భారీస్థాయిలో జంక్షన్ నిర్మించాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు మెట్రోల డిపిఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏ ప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. దీం తోపాటు హెచ్‌జిసిఎల్ (హైదరాబాద్ గ్రోత్ కా రిడార్ లిమిటెడ్) కింద రేడియల్ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని సిఎం పేర్కొన్నారు. మం గళవారం సాయంత్రం మెట్రో ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం- ఫ్యూచర్ సిటీ మెట్రో (40కి.మీ.),జేబీఎస్ టు -శామీర్‌పేట మెట్రో (22కి.మీ.),ప్యారడైజ్- టు మేడ్చల్ మెట్రో (23కి.మీ.) మార్గాలకు సంబంధించి భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.

ఎలివేటెడ్ కారిడార్ల వి షయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సిఎం పేర్కొన్నారు. అలైన్‌మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలన్నారు. మేడ్చల్ మా ర్గంలో ఎన్‌హెచ్ మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సిఎం అధికారులను ఆదేశించారు. శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూ సుకోవాలని అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్ లు ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ఆయా ప్రాం తాల వారు ప్రతి పనికి నగరంలోకి రానవస రం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్‌ల ను అభివృద్ధి చేయాలని సిఎం పేర్కొన్నారు. ఆ జంక్షన్‌లను సంబంధించిన పూర్తి ప్రణాళికను తయారు చేయాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News