మన తెలంగాణ/వరంగల్ ప్రతినిధి: వరంగల్ మహానగరాన్ని హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని, అందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వరంగల్ మహానగర అభివృద్ధిపై 15 అంశాలపై శనివారం హన్మకొండ కలెక్టరేట్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ మహానగరం ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నందున అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రత్యేక డిపిఆర్‌ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. డిపిఆర్ తయారీకి కన్సల్టెంట్ కంపెనీకి కావాల్సిన రూ.5 కోట్ల వ్యయాన్ని తక్షణమే మం జూరు చేస్తామన్నారు. అండర్ డ్రైనేజీ నిర్మాణంపై అధికారులు ప వర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా దాన్ని సిఎం వీక్షించారు.
అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ.4 వేలకు పైగా కోట్ల వ్య యం అవుతుందని అధికారులు చేసిన సూచనకు సిఎం గ్రీన్ సి గ్నల్ ఇచ్చి వెంటనే డిపిఆర్ తయారు చేయాలని ఆదేశించారు. వరంగల్ ఇన్నర్, ఔటర్, రింగు రోడ్లతో పాటు టెక్స్‌టైల్ పార్కు రోడ్లను జాతీయ రహదారులకు అనుసంధానం అయ్యేవిధంగా నిర్మించాలని సూచించారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ కూడా వేగంగా సేకరించాల న్నారు. ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లతో పాటు ఎయిర్‌పోర్టుకు కావాల్సిన భూసేకరణలో మంత్రులు ఎప్పటికప్పుడు దృష్టిని కేంద్రీకరించాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రుల స్థాయిలో ప్ర తీ 20 రోజులకొకసారి సమీక్షను నిర్వహించాలన్నారు. భూసేకరణ కు అవసరమయ్యే నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు కూ డాఅందించాలని అధికారులను ఆదేశించారు.స్మార్ట్‌సిటీ విషయం లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తాగునీటి వాటర్ లైన్ ఏర్పాటు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. నాలాలు ఆక్రమణలకు గురికాకుండా క ఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వరంగల్‌కు శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 2050కి సరిపడే విధంగా వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలని అ ధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సిఎస్ శాంతకుమారి, సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు, ఆ రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, కోమటిరె డ్డి వెంకట్‌రెడ్డి, ఎంపి కడియం కావ్య, ఎంఎల్‌ఎలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు డాక్టర్ ప్రావిణ్య, శారదాదేవి, తదితరులు పాల్గొన్నా రు.అనంతరం వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ని ర్మాణం పనులను పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ ధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులను ప్రశ్నించారు. ఎలాంటి అనుమతి లేకుండా రూ. 1100 కోట్లు ఉన్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచుతారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేవ లం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ వ్యయం పై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సిఎం ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు సిఎం తేల్చిచెప్పారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోం..
ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమ ని, సుపరిపాలన అందించి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అ హర్నిశలు కృషి చేయాలని ఆదేశించారు. వరంగల్ నగరా న్ని హైదరాబాద్ సరసన నిలబెడతామని పేర్కొన్నారు. అడిగిన అన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌కు వారసత్వంగా గొప్ప పేరు ఉందని, ఆ పేరును నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. సమ్మ క్క సారక్క, కాకతీయులు, తెలంగాణ ఉద్యమ చరిత్ర వరంగల్‌కు ఉందని గుర్తు చేశారు. వరంగల్‌ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
హెల్త్ సిటీ ఎకో టూరిజం, వివిధ విభాగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్ర ణాళిక చేస్తున్నామని వెల్లడించారు. అధికారులు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని సూచించారు. సమర్థత ఆధారంగానే బదిలీలు నిర్వహిస్తామని వెల్లడించా రు. రాజకీయ ప్రేరేపిత బదిలీలు ఉండబోవని స్పష్టం చేశా రు. అధికారులు భయపడవలసిన అవసరం లేదని, ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించా రు. జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలో త్వరలో సమావేశం నిర్వహించుకొని వరంగల్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని పేర్కొన్నారు. తా ను సమీక్ష ప్రాథమికంగానే నిర్వహించానని, 45 రోజులకు వచ్చి పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన అందిస్తామన్నారు.
రేవంత్‌కు ఘనస్వాగతం
మధ్యాహ్నం 1.15 గంటలకు మెగా టెక్స్‌టైల్ పార్కు వ ద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఆద్యం తం హుషారుగా సాగింది. ముఖ్యమంత్రిగా తొలిసారి జిల్లా లో అడుగు పెట్టడంతో ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు అడుగడుగున ఫ్ల్లెక్సీలు, హోర్డింగ్‌లతో ఆయనకు స్వాగతం పలికా రు. కాగా, హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పా టు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి రవి గుప్తా, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, వరంగల్ నగర మేయర్ గుండు సు ధారాణి, ఎంపి కడియం కావ్య, ఎంఎల్‌ఏలు కడియం శ్రీ హరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నా గరాజు, మురళీ నాయక్, యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ డా క్టర్ సత్య శారద, మాజీ ఎంఎల్‌సి కొండా మురళీధర్‌రావు రేవంత్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.