Wednesday, January 22, 2025

మా ఎమ్మెల్యేలను ముట్టుకో.. మాడి మసైపోతావు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్ లో శుక్రవారం నామినేషన్ వేశారు. వంశీచంద్ రెడ్డి నామినేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… ఈ పదేళ్లలో పాలమూరుకు కెసిఆర్ ఏం చేశారు?.. ఏం చేశారని పాలమూరు ప్రజలు బిఆర్ఎస్ కు ఓటేయాలి? అని సిఎం ప్రశ్నించారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కెసిఆర్ అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ హెచ్ టీ వైర్ లా తాను రక్షణగా ఉన్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మా ఎమ్మెల్యేలను ముట్టుకో.. మాడి మసైపోతావు అని సిఎం వార్నింగ్ ఇచ్చారు.

పాలమూరు ప్రజలు కళ్లు తెరిచారు.. గడీల దొరలను నమ్మరని ఆయన వెల్లడించారు. తెలంగాణ కావాలన్న చిన్నారెడ్డిని గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక చిన్నారెడ్డికి తగిన పదవి ఇచ్చి గౌరవించామన్నారు. మాదిగల వర్గీకరణ సమస్యలను శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. మాదిగల వర్గీకరణ కోసం పార్లమెంట్, సుప్రీంకోర్టులో పోరాడదామన్నారు. నేను పాలమూరు బిడ్డను.. ఈ జిల్లా సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. పదేళ్లుగా పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారని సిఎం మండిపడ్డారు. 14 లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీయే గెలవాలని రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News