Tuesday, January 21, 2025

చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తా బిడ్డా: కెసిఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

పదేళ్ల కేసీఆర్ పాలనలో వందేళ్ల విధ్యంసం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణను నాశనం చేశారని సిఎం మండిపడ్డారు. శనివారం సాయంత్రం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. కూతురు జైలుకు వెళ్లింది.. కాలు విరిగిందని బాధలో ఉంటాడని.. ఇన్నిరోజులు కెసిఆర్ పట్ల మర్యాదగా ఉంటూ వచ్చామని.. ఇక నుంచి ఊరుకునేది లేదన్నారు. ” ఏదిపడితే అది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. నేను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డిని.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ” అంటూ కెసిఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టలేదు కాని.. కేసీఆర్​ కు ఆయన కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​ రూం ఇల్లు కట్టిస్తాన సీఎం రేవంత్ అన్నారు​. బిఆర్​ఎస్​ ను బొంద పెట్టామని.. అదే ఉత్సాహంతోనే బిజెపిని కూడా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మా 100 రోజుల పాలన నచ్చితే 14 ఎంపి​ సీట్లను గెలిపించాలని ఆయన కోరారు. ఢిల్లీలో కాంగ్రెస్​ జండా ఎగురబోతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News