Monday, December 23, 2024

నోటికొచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్ జైలుకే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. ఆ మధ్య కుక్కలు మొరిగాయి, ఇప్పుడు నక్క బయలు దేరింది, కూతురు జైలుకు వెళ్లింది, కాలు విరిగిందని ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదని సిఎం అన్నారు. మాజీ సిఎం కెసిఆర్ భాష సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శని వారం జనజాతర సభలో రేవంత్ ప్రసంగిస్తూ కెసిఆర్‌పై నిప్పులు చెరి గారు. ఇకపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాను జానారెడ్డిని కాదని, రేవంత్‌రెడ్డినం టూ సిఎం పేర్కొన్నారు. 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చే శారని, జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి వి డుదల చేయడం సంతోషకరమన్నారు.

బిఆర్‌ఎస్‌ను ఓడించినట్లే దేశం లో బిజెపిని ఓడించాలని సిఎం పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదని, బిఆర్‌ఎన్‌ను తుక్కుతుక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జండా ఎగురబోతుందని సిఎం రేవంత్ అన్నారు. తెలంగాణ మొత్తం తుక్కుగూడకు పోటెత్తిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో న్యాయం కోసం రైతులు రోడ్డెక్కితే అణగదొక్కారన్నారు. పదేళ్లలో దేశానికి బిజెపి ఏం చేసిందన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టి మోడీ మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారని రేవంత్ అన్నారు.హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఎక్కడున్నారని సిఎం రేవంత్ ప్రశ్నించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ మువ్వెన్నల జెండా ఎగురబోతుంది
ప్రధాని మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరీ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఏవని సిఎం రేవంత్ ప్రశ్నించారు. మతం పేరిట చిచ్చుపెట్టి మూడోసారి అధికారం కోసం ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుందని, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు. జూన్‌లో ఢిల్లీలో కాంగ్రెస్ మువ్వెన్నల జెండా ఎగరబోతుందని సిఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. మా 100 రోజుల పాలన నచ్చితే 14 పార్లమెంట్ సీట్లను గెలిపించాలని సిఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం: డిప్యూటీ సిఎం భట్టి
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలను ప్రకటించామన్నారు. కెసిఆర్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని, 200 యూనిట్లలోపు విద్యుత్‌కు జీరో బిల్లులిస్తున్నామని ఆయన తెలిపారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి: మంత్రి పొన్నం
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తుక్కుగూడ జన జాతర సభ వేదిక నుంచి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పొన్నం అన్నారు. అసెంబ్లీకి రాని కెసిఆర్ జిల్లాల బాట పట్టారని మంత్రి పొన్నం విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని కెసిఆర్‌కు ఆయన సూచించారు. బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందన్నారు.
ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ పాదయాత్ర: మంత్రి శ్రీధర్‌బాబు
ప్రజలకు అభయమిస్తూ రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ పాదయాత్ర చేశారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగిందన్నారు. ప్రజలకు అభయమిస్తూ రాహుల్ పాదయాత్ర చేశారని ఆయన తెలిపారు.

దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్‌గాంధీలు ప్రాణాలు అర్పించారు: మంత్రి జూపల్లి
దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్‌గాంధీలు ప్రాణాలు అర్పించారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 2004లోనే సోనియాగాంధీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీ మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిగా చేశారన్నారు.
మోడీని ఉద్యోగాలు గురించి అడిగితే అయోధ్యను చూపిస్తున్నారు: మంత్రి సీతక్క
బిజెపి, బిఆర్‌ఎస్‌లు కలిసి కాంగ్రెస్‌ను అంతం చేయాలని చూస్తున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ దేశం మొత్తం తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. బిజెపి నేతలను ప్రశ్నిస్తే ఈడీ కేసులు పెడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. మోడీని ఉద్యోగాలు గురించి అడిగితే అయోధ్యను చూపిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టోలో తెలంగాణకు చెందిన 23 అంశాలు
యువ న్యాయం, భాగస్వామ్య న్యాయం, మహిళా న్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం పేరుతో రాహుల్ గాంధీ ఐదు గ్యారంటీ కార్డులను విడుదల చేశారు. ఇక దీంతోపాటు కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించి 23 అంశాలను ప్రకటించారు. అందులో ముఖ్యంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్రానికి నాలుగు కొత్త సైనిక స్కూళ్లు, క్రీడా విశ్వవిద్యాలయం, ఇండస్ట్రీయల్ కారిడార్, పాలమూరుకు జాతీయ హోదా, మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాల అమలు, ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 5 గ్రామాలను మళ్లీ తెలంగాణాలో కలుపుతాం, తెలంగాణాలో సుప్రీం కోర్టు బెంట్ ఏర్పాటు తదితర అంశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News